ఐడియా

చలికాలంలో మసాజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శీతాకాలంలో వాతావరణ ప్రభావం చర్మంపై ఎంతోకొంత ఉంటుంది. చర్మం తేమను కోల్పోయి పొడిబారుతుంది. దురదలు, పగుళ్లు, ఇతర చర్మసంబంధ సమస్యలు అనివార్యమవుతాయి. గోకడం వల్ల చర్మంపై తెల్ల మచ్చలు ఏర్పడుతాయి. చలికాలంలో కొన్ని పద్ధతులను పాటిస్తే చర్మ సంరక్షణ సాధ్యపడుతుంది. చలిగాలుల బారి నుంచి కాపాడుకోవాలంటే చర్మానికి మసాజ్ అవసరం. చలి ప్రభావం చర్మంపైనే కాదు, ఎముకలు, కండరాల మీద కూడా ఉంటుంది. కండరాలు బిగుతుగా అవడంతో వాటి కదలిక కొంత కష్టమవుతుంది. ఆయిల్ మసాజ్ చేసుకుంటే ఎముకలు, కండరాల్లో సులువుగా కదలిక ఏర్పడుతుంది. తేమ అందడంతో చర్మం పొడిబారదు. మసాజ్ చేసుకున్న తరువాత శరీరానికి ఆవిరి పడితే ఎంతో వెచ్చదనంతో ఉపశమనం కలుగుతుంది. మసాజ్‌లలో ఎన్నో రకాలున్నప్పటికీ, రెండు రకాలు ముఖ్యమైనవి. బాత్ మసాజ్‌గా వ్యవహరించే ఆయుర్వేద మసాజ్‌లో ఔషధాలు కలిగిన నూనెలు ఉపయోగిస్తారు. ఆ నూనెలను వేడి చేసి దాదాపు గంటన్నర సేపు మసాజ్ చేస్తారు. చలికాలంలో వారానికి ఒకసారి ఆయుర్వేద మసాజ్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

-కె.నిర్మల