దేవిశ్రీప్రసాద్‌లో పూజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విలక్షణ చిత్రాల దర్శకుడు శ్రీకిశోర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘దేవిశ్రీప్రసాద్’. ఆర్.ఓ.క్రియేషన్స్ బ్యానర్‌పై రుద్రరాజు వెంకటరాజు, ఆక్రోష్ నిర్మాతలుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ పుట్టినరోజునే యాదృచ్ఛికంగా ప్రారంభం కావడం విశేషం. స్వామిరారా, పిజ్జా చిత్రాల్లో నటించి మెప్పించిన పూజా రామచంద్రన్ ఈ చిత్రంలో నటిస్తుంది. వైవిధ్య భరితంగా ఉంటూ ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేసే ఆసక్తికరమైన మలుపులతో సాగే కథాంశంతో సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుందని నిర్మాతలు చెబుతున్నారు. పోసాని కృష్ణమురళి సెల్ఫీ రాజా అనే పోలీస్ క్యారెక్టర్‌లో నటిస్తున్నారు. అన్ని హంగులతో సినిమాను రూపొందిస్తున్నామని దర్శకుడు శ్రీకిశోర్ అన్నారు. అయితే, దేవిశ్రీప్రసాద్ చిత్రంలో టైటిల్ రోల్ పోషించే నటుడెవరనే విషయాన్ని దర్శకుడు గోప్యంగా ఉంచుతున్నారు. ఆ నటుడెవరనే విషయంపై సినీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.