ధ్రువ ఫస్ట్‌లుక్ వస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ్ ‘తనీఒరువన్’కు రీమేక్‌గా రామ్‌చరణ్ చేస్తున్న చిత్రం ‘ధ్రువ’. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. వరుసగా రెండు సినిమాలు పరాజయం పొందడంతో చరణ్ ఈ తాజా సినిమాపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రంలో చరణ్ ఓ పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో అలరించనున్నాడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదల చేస్తారు. రిలీజ్ డేట్ పోస్టర్ ఇప్పటికే విడుదలై చరణ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో చరణ్ సరసన రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది.