మంచుకొండల్లో ఫుల్‌మూన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హర్షకుమార్, డాలీశర్మ జంటగా గ్లిట్టర్స్ ఫిలిం అకాడమీ పతాకంపై దీపక్ బలదేవ్ దర్శకత్వంలో తెలుగు, హిందీ భాషల్లో ప్రకాష్ ఠాగూర్ రూపొందిస్తున్న చిత్రం ఫుల్‌మూన్’. దీనికి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, ‘బాడ్ డెడిషన్స్ మేక్ బెటర్ స్టోరీస్’ అనే ఉపశీర్షికతో రూపొందించిన ఈ చిత్రాన్ని మంచుకొండల్లో చిత్రీకరించామని తెలిపారు. డెహ్రాడూన్, సిమ్లా, కసోల్‌లలో షూటింగ్ చేసిన ఈ చిత్రంలో మూడు జంటల ప్రేమాయణం ప్రేక్షకులకు నచ్చుతుందని తెలిపారు. చిత్రంలోని పాటలను ప్రేక్షకులకు వీనులవిందు చేస్తాయని, కెమెరా పనితనం కంటికి ఇంపుగా వుంటుందని తెలిపారు. నదీమ్ భార్గవ్, కామ్నాసింగ్, అభిలాష్, రుహానీ శర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:అభిలాష్ గొలిడె, మాటలు:అశ్వనీ సింగ్, కెమెరా:ఖన్నా, నిర్మాత:ప్రకాష్ ఠాగూర్, దర్శకత్వం:దీపక్ బలదేవ్.