సస్పెన్స్‌తో జర్నీ-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గణేష్, మంజరి జంటగా జయలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై ఎస్.నారాయణ దర్శకత్వంలో చిగులూరి గంగాధరరావు చౌదరి రూపొందిస్తున్న చిత్రం జర్నీ-2. దీనికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ ముగిసిన సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ, స్వార్థం లేని ప్రేమ ఎప్పుడు ఎవరి మధ్య ఎలా పుడుతుందో చెప్పలేమని, అంశాన్ని తీసుకుని చిత్రాన్ని రూపొందించామన్నారు. హీరో హీరోయిన్లు ఒకరినొకరు చూసుకోకుండానే కవిత్వం రాసుకుని ప్రేమలో పడతారని, చివరికి గాఢ ప్రేమికులుగా మారిపోయిన వారిద్దరికి ఒకరినొకరు ఎలా పరిచయమయ్యారనే సస్పెన్స్‌గా చిత్రం సాగుతుందని తెలిపారు. ఈ చిత్రం కన్నడంలో అద్భుత విజయం సాధించిందని, తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని అన్నారు. ఈ చిత్రానికి మాటలు:వెనె్నలకంటి శశాంక్, ఎడిటింగ్:ఇ.ఎమ్.నాగేశ్వరరావు, సమర్పణ:కొత్తూరు నేతాజి, కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం:ఎస్.నారాయణ.