చిన్న సినిమాలు అదుర్స్ .... దర్శకుడు దాసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు శిరీష్, లావణ్యాత్రిపాఠి జంటగా పరశురామ్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన శ్రీరస్తు శుభమస్తు చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ను ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు, వి.వి.వినాయక్, సుకుమార్, నందినిరెడ్డిలతోపాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాసరి నారాయణరావు మాట్లాడుతూ.. తాను దర్శకత్వం వహించిన ‘బంట్రోతు భార్య’ చిత్రంతో గీతా ఆర్ట్స్ బ్యానర్ ప్రారంభమైందని, 45 సంవత్సరాలుగా విజయవంతమైన చిత్రాలను నిర్మిస్తుండడం గొప్ప విషయమని, తాను నేను తీసిన మాయాబజార్ సినిమాలో బన్నీని నటుడిగా పరిచయం చేశానని అన్నారు. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చునని, నిజానికి బన్నీకంటే కూడా శిరీష్‌నే నటుడిగా చూడాలన్నది అల్లు రామలింగయ్య కోరికని, అందుకే ఆయన షూటింగ్‌లకు తీసుకొచ్చేవారని అన్నారు. శిరీష్ మంచి క్రమశిక్షణ ఉన్న వ్యక్తని, అది చిరంజీవి అడుగుజాడల్లో నడవడంవల్లనో, అరవింద్ పెంపకం వల్లనో వచ్చిన క్రమశిక్షణ అన్నారు. ఇక ఈ సినిమాలో తను అద్భుతంగా నటించాడని, ఇలాంటి సినిమాలు చూసినప్పుడు వీటికి నేను బ్రాండ్ అంబాసిడర్ అయితే బావుంటుందని అనిపిస్తుందని, చిన్న సినిమాలు బ్రతకాలని, ఈమధ్య చాలావరకు సినిమాలు ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉండలేని పరిస్థితికి చేరుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ కొన్ని సినిమాలు అందరూ మెచ్చేలా ఉంటున్నాయని, ముఖ్యంగా మంచి కంటెంట్‌తో తెరకెక్కుతున్న సినిమాలు ఎక్కువగా వస్తున్నాయన్నారు. వినాయక్ మాట్లాడుతూ, ఈ సినిమాతో పరశురామ్ రచయితగా ప్రూవ్ చేసుకున్నాడని, ముఖ్యంగా క్లైమాక్స్‌లో త్రివిక్రమ్ స్టయిల్ డైలాగులు రాశాడని, శిరీష్ పెద్ద బిజినెస్‌మెన్ అవుతాడనుకుంటే హీరో అయ్యాడని అన్నారు. సుకుమార్ మాట్లాడుతూ శిరీష్ హీరో అవుతాడని తెలిసిన మొదటి వ్యక్తిని తానేనని, తను లవర్‌బాయ్‌గానో, పక్కింటబ్బాయిగానో చేస్తే మంచి అవకాశం ఉంటుందని చెప్పాడని, అదే విధంగా సినిమాలు ఎంచుకుంటూ వెళుతున్నాడని, పరశురామ్ తనదైన టాలెంట్‌తో ప్రూవ్ చేసుకున్నాడని, ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన టీమ్‌ని అభినందిస్తున్నానన్నారు. శిరీష్ మాట్లాడుతూ, ఒక సినిమా హిట్ అనేది దర్శకుడిమీదే ఆధారపడి ఉంటుందని, ఇంత మంచి సినిమాను ఇచ్చిన దర్శకుడు పరశురామ్‌కు కృతజ్ఞతలు అన్నారు.