మనోజ్ ఫైట్‌తో లక్ష్మీబాంబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచు లక్ష్మీ ప్రసన్న ముఖ్యపాత్రలో కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో ఉద్భవ్ ప్రొడక్షన్స్ పతాకంపై వేళ్ల వౌనిక చంద్రశేఖర్, ఉమా లక్ష్మీనరసింహ నిర్మిస్తున్న చిత్రం లక్ష్మీబాంబ్. దాదాపు షూటింగ్ పూర్తికావచ్చిన ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈ ఫైట్స్ హీరో మంచు మనోజ్ నేతృత్వంలో రూపొందించడం విశేషం. ఈ సందర్భంగా లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ.. ‘చాలా ఎగ్జైటింగ్‌గా వుంది. ఛాలెంజింగ్ పాత్ర ఇది. ఇప్పటివరకూ ఇలాంటి పాత్రను చేయలేదు. సింగిల్ షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తిచేశాం. ప్రస్తుతం ఫైట్ సన్నివేశాల్ని తమ్ముడు మనోజ్ ఆధ్వర్యంలో చేస్తున్నాం. చాలా బాగా వస్తున్నాయి. దర్శకుడు గోపాలకృష్ణ అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి దీపావళికి విడుదల చేస్తాం’ అని అన్నారు. దర్శకుడు గోపాలకృష్ణ మాట్లాడుతూ..‘మనోజ్ ఈ సినిమాకు యాక్షన్ సీన్స్ చేయడం ఆనందంగా వుంది. ఫైట్ చాలా బాగా వచ్చింది. ఎంటర్‌టైన్‌మెంట్, కామెడీ, థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కే ఈ చిత్రం రేపటితో షూటింగ్ పూర్తవుంది. త్వరలోనే పాటల్ని విడుదల చేసి, దీపావళికి రిలీజ్ చేస్తాం’ అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్‌కశ్యప్, కెమెరా: మల్హర్‌భట్ జోషి, కథ, మాటలు: డార్లింగ్ స్వామి, నిర్మాతలు: వేళ్ల వౌనిక చంద్రశేఖర్, ఉమా లక్ష్మీనరసింహ, దర్శకత్వం: కార్తికేయ గోపాలకృష్ణ.