అభాగ్యుల గల్ఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేతన్, డింపుల్ ప్రధాన తారాగణంగా సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో యక్కలి రవీంద్రబాబు, రమణికుమార్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం గల్ఫ్. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. పిడికెడు మెతుకులకోసం పొట్టచేతపట్టుకొని గల్ఫ్ వెళ్లే అభాగ్యుల జీవిత కథనాలను అధ్యయనం చేసి, ఈ కథ రాసుకున్నానని, దూరపుకొండలు నునుపు అనే సామెతను మరిచిపోయి కన్నవారిని, కట్టుకున్నవారిని వదిలి దూరంగా వెళుతున్నవారు సుఖంగా జీవితం గడుపుతున్నారా? లేదా? లేక ముళ్లమధ్య గులాబీల్లా బ్రతుకుతున్నారా అన్న కథనంతోపాటుగా స్వచ్ఛమైన ఓ ప్రేమకథను ఈ సినిమాలో చర్చిస్తున్నామని తెలిపారు. సమాజంలోని కొన్ని కోణాలను సూటిగా ప్రశ్నిస్తే వెండితెరపై సినిమాలుగా ఆవిష్కరించే తమ దర్శకుడు ప్రత్యేకతగా ఈ సినిమా వైవిధ్యంగా రూపొందుతోందని, ఇసుక తీరాలలో మనవాళ్లు పడుతున్న కష్టాలను కళ్లముందు ఈ సినిమా సాక్షాత్కరింపజేస్తోందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నామని, ఈనెలాఖరుకు అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, సెప్టెంబర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని నిర్మాతలు తెలిపారు.