సుశాంత్‌కు బ్రేక్‌నిచ్చే ఆట ఇది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుశాంత్ హీరోగా జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో శ్రీనాగ్ కార్పొరేషన్, శ్రీ జీ ఫిలింస్ పతాకంపై చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మిస్తున్న చిత్రం ‘ఆటాడుకుందాం రా’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 19న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు చెప్పిన విశేషాలు.

ఆటాడించబోతున్నారు
సుశాంత్‌తో ఇదివరకు మూడు చిత్రాలు నిర్మించిన మేము మరోసారి ఆయనతో రూపొందించిన చిత్రం ‘ఆటాడుకుందాం రా’. నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా వుంటుంది. నాగేశ్వర్‌రెడ్డి మార్క్ సినిమాలు ఎలా వుంటాయో అందరికీ తెలుసు. అదే కోవలో తెరకెక్కిన ఈ చిత్రంతో వీరిద్దరూ ప్రేక్షకుల్ని ఆటాడించబోతున్నారు.
అన్ని హైలేట్లే
ఈ చిత్రానికి అనూప్ అందించిన సంగీతం మంచి హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఇందులో అక్కినేని నటించిన ‘దేవదాసు’ చిత్రంలోని ‘పల్లెకు పోదాం పాట’ బాగా పాపులరైంది. శ్రీ్ధర్ శీపాన అందించిన కథ, మాటలు చిత్రానికి హైలెట్‌గా నిలుస్తాయి.
కమర్షియల్ బ్రేక్
కాళిదాస్ సినిమాతో హీరోగా పరిచయమైన సుశాంత్, ఆ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కరెంట్, అడ్డా సినిమాల తరువాత ఆయన చేసిన ఆటాడుకుందాం రా సినిమా మంచి కమర్షియల్ బ్రేక్‌నిస్తుంది. హీరోయిన్‌గా పరిచయం అవుతున్న సోనమ్ బజ్వా అద్భుతంగా నటించింది. ఆమె గతంలో చేసిన రెండు పంజాబీ సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. తనకు కూడా మంచి బ్రేక్ వస్తుంది.
అక్కినేని ‘్ఫ్యమిలీ ప్యాక్’
ఈ చిత్రంలో అక్కినేని యువ హీరోలు నాగచైతన్య ఓ గెస్ట్ పాత్రలో కన్పిస్తాడు. అతని పాత్ర ఎంట్రీతో కథ మొత్తం మారిపోతుంది. కనిపించేది కొద్దిసేపే అయినా చాలా ప్రాముఖ్యత వున్న పాత్రలో కన్పిస్తాడు. అఖిల్ క్లైమాక్స్‌లో వచ్చే సాంగ్‌లో సుశాంత్‌తో కలిసి చేసిన డాన్స్ బాగుంటుంది. బ్రహ్మానందంతో నడిచే టైం మిషన్ ఎపిసోడ్ చాలా హైలెట్‌గా వుంటుంది.
వరుస సినిమాలు
ఇప్పటివరకు శ్రీనాగ్ కార్పొరేషన్ బ్యానర్‌పై సినిమాలు తీశాం. ఈ సినిమాతో శ్రీజీ ఫిలింస్ కూడా యాడ్ అయింది. ఇకపై అక్కినేని కుటుంబ హీరోలే కాకుండా బయటి హీరోలతో కూడా సినిమాలు చేస్తాం.

-శ్రీ