పెళ్లిపీటలెక్కనుందా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళంలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విశాల్ తెలుగులో కూడా వరుస సినిమాలతో ఇక్కడా మంచి ఇమేజే తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన తమన్నాతో నటిస్తున్న చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ఈ సినిమా తర్వాత విశాల్ పెళ్లిచేసుకోవడానికి సిద్ధవౌతున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆయన్ను పెళ్లెప్పుడంటూ అందరూ అడుగుతుంటే ‘తర్వాత.. తర్వాత’ అంటూ దాటవేస్తూ వచ్చాడు. కొన్ని రోజులుగా తమిళ నటుడు శరత్‌కుమార్ కూతురు వరలక్ష్మితో విశాల్ ప్రేమాయణం సాగిస్తున్నాడట! ఈ విషయంపై కోలీవుడ్‌లో చాలా కథనాలే నడిచాయి. శరత్‌కుమార్‌కు, విశాల్‌కు మధ్య నడిగర్ సంఘం విషయంలో విభేదాలు వచ్చాయి. ఇటీవలే విశాల్ అండ్ టీమ్ కలిసి నడిగర్ సంఘం కోసం నిర్మిస్తున్న భవన నిర్మాణం పనులు జనవరిలో పూర్తవుతాయి. ఆ వెంటనే తాను పెళ్లిచేసుకుంటానని విశాల్ చెప్పాడట. శరత్‌కుమార్‌ని ఒప్పించే ఆయన వివాహం చేసుకుంటాడని కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వరలక్ష్మి కూడా పెళ్లికి సిద్ధమైనట్టే వుంది. ఈమె హీరోయిన్‌గా రెండు మూడు చిత్రాల్లో నటించినా పెద్దగా కమర్షియల్‌గా విజయాలను అందుకోలేకపోయింది.

చిత్రం.. వరలక్ష్మి