ఫ్యాక్షన్ ప్రేమకథగా సిద్ధార్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చక్రవాకం, మొగలి రేకులు టీవీ సీరియల్స్‌తో నటుడిగా గుర్తింపు తెచ్చుకుని మాన్ ఆఫ్ ది మ్యాచ్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టాడు సాగర్. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘సిద్ధార్థ’. కె.వి.దయానందరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమైన సందర్భంగా హీరో సాగర్ వివరాలు తెలిపారు. ‘మంచి టెక్నికల్ టీమ్‌తో రూపొందుతున్న చిత్రమిది. ఇంద్ర, నరసింహనాయుడు వంటి భారీ చిత్రాలకు పనిచేసిన టీమ్‌తో పనిచేస్తున్నా. పరుచూరి బ్రదర్స్ మాటలు, మణిశర్మ సంగీతం అలాగే ఎస్.గోపాల్‌రెడ్డి ఫొటోగ్రఫితో తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఇది ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమకథ. అనంతపురంలో కథ మొదలై మలేసియావరకూ వెళుతుంది. మాస్, యాక్షన్, లవ్ అంశాలున్నాయి. ఈ సినిమాతో హీరోగా మంచి హిట్ అందుకుంటాననే నమ్మకముంది. ఇటీవలే చివరి షెడ్యూల్ పూర్తిచేశాం. త్వరలోనే పాటలు విడుదల చేసి వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. టీవీ రంగంలో నటుడిగా నాకంటూ ఇమేజ్ దక్కింది. త్వరలోనే టీవీ రంగంలో ప్రొడక్షన్ కంపెనీ మొదలుపెడతా. నటుడిగా టీవీకి, సినిమాకు పెద్దగా తేడా ఏమీ అనిపించలేదు. ఎక్కడైనా నటించడమే కదా! అలాగే వేరే హీరోల సినిమాల్లో మంచి పాత్ర వస్తే తప్పకుండా నటిస్తా’ అన్నారు.