బావ-మరదలు టీజర్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోహన్‌కృష్ణ, శిరీష, సౌజన్య హీరోహీరోయిన్లుగా గంగారావు లక్ష్మణమూర్తి దర్శకత్వంలో మాణిక్య మూవీస్ పతాకంపై రాజు నిర్మిస్తున్న చిత్రం ‘బావ మరదలు’. ఈ సినిమా టీజర్ లాంచ్ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. టీజర్‌ను ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భవద్వాజ విడుదల చేసారు. మోషన్ పోస్టర్‌ను దర్శకుడు కళ్యాణ్ కృష్ణ విడుదల చేయగా, నిర్మాత లగడపాటి శ్రీ్ధర్, దర్శకుడు సముద్ర తదితరులు పాల్గొన్నారు. అనంతరం తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, కొత్త దర్శకనిర్మాతలు, హీరోహీరోయిన్స్ కలిసి చేసిన ప్రయత్నం అందరికీ మంచి పేరు తీసుకురావాలని అన్నారు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ, ఈమ ధ్య చిన్న సినిమాలు మంచి విజయాలు అందుకుంటున్నాయని, ఆ కోవలోనే ఇది విజయం సాధించాలని అన్నారు. మరో దర్శకుడు సముద్ర మాట్లాడుతూ, మంచి అవగాహనతో చేస్తే చిన్న సినిమాలు ఘన విజయాలను సాధిస్తాయన్నారు. దర్శకుడు గంగారావు లక్ష్మణమూర్తి మాట్లాడుతూ, ‘అతడు ఆమె ఓ స్కూటర్’ తరువాత తాను చేస్తున్న ఈ చిత్రం అందరికి నచ్చుతుందన్నారు.