26న గ్యారేజ్ మలయాళ పాటలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్, సమంత, నిత్యామీనన్ హీరోహీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ చిత్రం వచ్చేనెల 2న విడుదలకు సిద్ధవౌతోంది. ఇప్పటికే తెలుగులో భారీ అంచనాలతోపాటు మంచి బిజినెస్‌ను జరుపుకుంటున్న ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు మలయాళంలో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన తెలుగు పాటలు ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని నమోదుచేసుకున్నాయి. మలయాళ వెర్షన్ పాటల్ని ఈనెల 26న కొచ్చిలో విడుదల చేస్తారట. ఈ సినిమాతో ఎన్టీఆర్ మలయాళంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అక్కడ కూడా ఈ సినిమాకు భారీ హైప్ నెలకొంది.