మంచి మాట

సనాతన ధర్మం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఏష ధర్మస్సనాతనః’ అనేది స్మృతివాక్యం. అంటే ఇది సనాతన ధర్మం అని అర్థం. సనాతన ధర్మం అధునాతన ధర్మం అని రెండు వేర్వేరు ధర్మాలున్నాయా అంటే లేవు అని స్పష్టంగా చెప్పవచ్చును. మరి ధర్మాల్ని సనాతన ధర్మం అని పెద్దలెందుకు చెప్పారు? పురాణేతిహాసాలలో ఇది సనాతన ధర్మం అని పలుచోట్ల వచించబడింది. పురాతనంగా కనిపించినా, ధ్వనించినా నిత్యనూతనమైనది సనాతనం. కాలపరిమితులకు లొంగని శాశ్విత ధర్మం, సనాతన ధర్మం, అధునాతన కాలంలోనూ చెల్లుబాటు అయ్యేది ఈ శాశ్విత ధర్మమే. ఇందులో చేర్పులు మార్పులకు తావులేదు.
అనాదికాలం నుండి ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాల సాధనయే ప్రతి వ్యక్తి పరమ లక్ష్యంగా చేసుకొని భారతీయులందరు తమ జీవనాన్ని సాగిస్తూ వస్తున్నారు. ఈ పురుషార్థ సాధనవల్లనే మనిషి జన్మకి పరిపూర్ణత్వం లభిస్తుంది. ఇలా మానవ జన్మకు పరిపూర్ణత్వం కలిగించే పురుషార్థాలలో మొదటిది ‘్ధర్మం’. ఈ ధర్మంపై మిగిలిన మూడు పురుషార్థాలు అంటే అర్థ, కామ, మోక్షాలు ఆధారపడి ఉన్నాయి. ఈ విషయానే్న స్పీష్టీరిస్తూ వ్యాస భగవానులు ‘‘చేతులెత్తి బిగ్గరగా బోధిస్తున్నాను. వినండి. అర్థ కామ మోక్షాలను కోరుకునే వారంతా ధర్మానే్న ఆశ్రయించండి’’ అని అన్నారు. రామాయణంలో కూడా ‘్ధర్మము ద్వారానే అర్థము, సుఖము, సర్వము లభిస్తాయని’’ చెప్పబడింది. ‘‘ఏ ప్రాణి ధర్మాచరణమును ఆచరిస్తాడో వానికి స్వర్గము, ధర్మాచరణ చేయనివానికి నరకము ప్రాప్తిస్తాయి. అందుకే మనిషికి ఇహ పర సుఖాలకు సహాయ పడేది ధర్మమే’’ అని మహాభారతం ధర్మాచరణవలన కలిగే ఫలితాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఇహ పర సుఖదాయకమైన ధర్మాచరణే ప్రతి ఒక్కరి కర్తవ్యం.
సూర్యోదయ చంద్రోదయాలవలె నిత్య నూతనమది. నిత్యజ్ఞానం సనాతనం. ధర్మం అంటే ఏమిటి? దర్శించునది ధర్మమని శాస్తవ్రాక్యం. వృక్షానికి వేర్లు ఆధారం. దానివలన చెట్టు నిలుస్తుంది, ఎదుగుతుంది, బ్రతుకుతుంది. నిస్వార్థంగా చెట్టు మానవసేవకు అంకితమవుతుంది. అలాగే మానవ జన్మకు మూలం ధర్మం. దానివలన మనిషి జ్ఞానవంతుడవుతాడు. అతను ప్రజాశ్రేయస్సుకు అనుకూలమైన కార్యాలు చేసే ప్రయత్నంలో క్రియాశీలుడవుతాడు. అంటే ధర్మం అతడ్ని ఆ మార్గంలో నడిపిస్తుంది. మానవసేవను మించిన మాధవసేవ లేదు. అలాంటి ధర్మం జగత్తుకు ఆధారమని ధార్మికుని జనులందరు ఆశ్రయిస్తారు.
‘‘దేని చేత చరాచరాత్మకమైన ఈ జగత్తు నశించకుండా నిలబెట్టబడుతుందో, అదే ధర్మం’’ అని ధర్మశబ్దానికి అర్థం. ఇందుకు భిన్నంగా అధర్మపరుడు స్వార్థం గురించే ఆలోచిస్తాడు. ఇతరుల కష్టాలు తనవి కానప్పుడు తను ఎందుకు కల్పించుకోవాలి అనుకుంటాడు. తను సంఘజీవి సమాజ జీవి అనేది విస్మరిస్తాడు. పొరుగువాడు కష్టాలలో ఉంటే తాను సుఖంగా బ్రతకగలనా అని ఆలోచించడు. అందువలన తను పతనావస్థకు దిగజారకుండా ఉండాలంటే ధర్మాచరణకు మించిన మార్గం లేదు. సిరిసంపదలు శాశ్వతం కావు. ఈనాడుండే రేపు హరిస్తాయి. ఎంతటి సంపదలున్నా సమాజానికి ఉపయోగపడని అధర్మపరుడు నిత్య దరిద్రుడేని స్వామి వివేకానంద విజ్ఞతతో చెప్పాడు.
ధర్మాన్ని ప్రఫథమంగా మనకందించినది వేదం. అందువలన వేదము ధర్మానికి మూలం అని సర్వులు వేదాన్ని శిరసావహిస్తారు. వేదవాక్కు అంటే ధర్మబద్ధమైన వాక్కు. దానికి తిరుగులేదు. ఎంతటి వింతవాదన అయినా వేద వాక్కును ఖండించలేదు.
వేదాల పుట్టుకకు పరబ్రహ్మ కారకుడు. అతని నాలుగు ముఖాలనుంచి నాలుగు వేదాలు పుట్టాయి. మహర్షులు, మునులు, తపోధనులు తమ తపోబలంతో వేదాలను వెలికితీసి లోకానికి అందించారు. వేద ధర్మాన్ని జీవన వ్యవహారంలోనికి తీసుకువచ్చి, సర్వజనులు ఆచరించేటట్లు ప్రబోధించినవి స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు. వీటికి కేవలం కృతజ్ఞతలు తెలియజేసినందువలన ప్రయోజనం లేదు. మన దిన చర్యలో వాటిని ఆచరించాలి.

-గుమ్మా ప్రసాదరావు