చైతు ప్రేమమ్ పాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని నాగచైతన్య, శ్రుతిహాసన్, అనుపమా పరమేశ్వరన్, మడొన్నా సెబాస్టియన్ ముఖ్యపాత్రల్లో చందూ మొండేటి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమమ్’. మలయాళంలో సూపర్‌హిట్ అయిన ప్రేమమ్ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పాటను గురువారం ఉదయం విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో నాగచైతన్య మాట్లాడుతూ, నా మనసుకు బాగా హత్తుకున్న చిత్రమిదని అన్నారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ- ‘ఎవరే అంటూ’ సాగే ఈ గీతాన్ని శ్రీమణి రచించగా, గాయకుడు విజయ్ ఏసుదాసు ఆలపించారు. ఈ నెల 24న చిత్రంలోని పాటలను విడుదల చేయనున్నాం. మంచి ప్రేమకథతో కూడిన మ్యూజికల్ ఎంటర్‌టైనర్ ఇది. త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సెప్టెంబర్‌లో విడుదల చేస్తాం అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:గోపీసుందర్, రాజేష్ మురుగేశన్, కెమెరా:కార్తిక్ ఘట్టమనేని, ఎడిటింగ్:కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్:సాహి సురేష్, సమర్పణ:పి.డి.వి.ప్రసాద్, నిర్మాత:సూర్యదేవర నాగవంశి, దర్శకత్వం:చందూ మొండేటి.