ప్రేక్షకులే బంగారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బాబు బంగారం’ సినిమాకు మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులే బంగారం లాంటివారని హీరో వెంకటేష్ అన్నారు. వెంకటేష్, నయనతార జంటగా మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఎస్.నాగవంశి, పి.డి.వి ప్రసాద్ నిర్మించిన ‘బాబు బంగారం’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతోన్న సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. ఈ సినిమా తీస్తున్నప్పుడు నా బాడీ లాంగ్వేజ్, కాస్ట్యూమ్స్ సహా అన్ని విషయాల్లో దర్శకుడు మారుతి చాలా జాగ్రత్తలు చెప్పారని అన్నారు. అనంతరం నటుడు పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ, ‘వెంకటేష్ సినిమాల్లో ఇంతకుముందు రెండుసార్లు నటించాను. ఇది హ్యాట్రిక్ సినిమా. ఈ సినిమాలో మంచి పాత్ర చేసినందుకు ఆనందంగా వుంది’ అని అన్నారు. నటుడు పృధ్వీ మాట్లాడుతూ,‘నేను ఏ సినిమా చేసినా సురేష్‌బాబు చూసి బావుందమ్మా అనేవారు. కానీ ఈ సినిమా చూసి చాలా బాగా చేశావ్ అని అభినందించారు’ అని అన్నారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ ‘ మొదటిరోజు భారీ అంచనాలు వుండడంవల్ల కాస్త మిక్స్‌డ్ టాక్ వచ్చింది. నా నుంచి వచ్చిన కమర్షియల్ చిత్రాన్ని ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడానికి కాస్త టైమ్ పట్టింది. ఈ చిత్రాన్ని ఫ్యాన్స్, లేడీస్, మాస్ అందరికీ బాగా నచ్చింది’ అని అన్నారు.