యాక్షన్ మొదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు చిరంజీవి చాలా గ్యాప్ తరువాత రీఎంట్రీ ఇస్తూ నటిస్తున్న 150వ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం హైదరాబాద్‌లోని నానాక్‌రామ్‌గూడాలో వేసిన ప్రత్యేక సెట్‌లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సాగుతోంది. ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో రూపొందిస్తున్న ఈ ఫైట్స్ హైఓల్టేజ్ యాక్షన్స్‌తో వుంటాయని తెలిసింది. తమిళ సూపర్‌హిట్ ‘కత్తి’ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో చిరు సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ‘కత్తిలాంటోడు’ అనే టైటిల్ పెడతారంటూ వార్తలు వస్తున్నాయి. ఈనెల 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌తో వున్న ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తారట. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ పూర్తిచేసి సంక్రాంతి కానుకగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.