బాలీవుడ్ ఛాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ రెజీనా ప్రస్తుతం నక్షత్రం సినిమాలో నటిస్తోంది. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతోబాటు అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ‘జోఅచ్యుతానంద’ సినిమాలో కూడా నటిస్తోంది. తాజాగా ఈమె బాలీవుడ్ అవకాశాన్ని దక్కించుకుంది. ప్రముఖ నటుడు అమితాబ్ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన సరసన నటించేందుకు ఓకె చెప్పిందట. 2002లో విడుదలై మంచి విజయం సాధించిన థ్రిల్లర్ చిత్రం ఆంఖేన్ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రూపొందించే పనిలో ఉన్నారు. ఆంఖేన్-2 పేరుతో తెరకెక్కే ఈ సినిమాలో రెజీనా ఓకె అయ్యింది. బ్యాంక్ దోపిడీ నేపథ్యంలో తెరకెక్కిన మొదటి భాగంలో అర్జున్ రాంఫాల్, అక్షయ్‌కుమార్, సుస్మితాసేన్‌లు నటించారు. మరి ఇప్పుడు ఈ సీక్వెల్‌లో అక్షయ్‌కుమార్ పాత్రలో జాన్ అబ్రహం నటిస్తున్నాడట. మొత్తానికి బాలీవుడ్ ఛాన్స్ దక్కించుకున్న రెజీనా, ఈ సినిమాతో అక్కడ ఎలాంటి ఇమేజ్ దక్కించుకుంటుందో చూడాలి!

చిత్రం..రెజీనా