16న రానున్న శంకర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారా రోహిత్, రెజీనా జంటగా తాతినేని సత్యప్రకాష్ దర్శకత్వంలో శ్రీ లీలా మూవీస్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘శంకర’. తమిళంలో విజయవంతమైన ‘వౌనగురు’ చిత్రానికి రీమేక్‌గా నిర్మించిన ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి వచ్చేనెల 16న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ఆర్.వి.చంద్రవౌళీ ప్రసాద్ మాట్లాడుతూ, వ్యవస్థలో వున్న లోటుపాట్లు కథానాయకుడు శంకరకు నచ్చక ప్రతిఘటిస్తుంటాడని, ప్రతి విషయాన్ని ప్రశ్నించే కొడుకును చూసి అతని తల్లి, సోదరుడు మార్చడానికి ప్రయత్నిస్తారని తెలిపారు. పట్నం వెళ్లిన అతనికి ఓ యాక్సిడెంట్ జరుగుతుందని, అక్కడ ఓ నేరంలో ఇరుక్కున్న కథానాయకుడు ఎలా నిర్దోషిగా నిరూపించుకున్నాడు అన్న కథనమే ఈ చిత్రమని తెలిపారు. అన్ని వర్గాలవారికి నచ్చే అంశంతో రూపొందిన ఈ చిత్రంతో నారా రోహిత్ కెరీర్ మరో మలుపు తిరగడం ఖాయమని చిత్ర సమర్పకుడు ఎం.వి.రావు తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేశామని, విజయవంతం అవుతుందన్న నమ్మకం వుందని ఆయన తెలిపారు. జాన్ విజయ్, రాజీవ్ కనకాల తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:టి.సురేందర్‌రెడ్డి, ఎడిటింగ్:కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాత: ఆర్.వి.చంద్రవౌళీ ప్రసాద్ (కిన్ను), దర్శకత్వం: తాతినేని సత్యప్రకాశ్.