ప్రారంభమైన రామసక్కనోడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మా నాన్న ఫిలింస్ పతాకంపై రాహుల్ రవీంద్రన్, నిత్యాశెట్టి, తరుణిక ప్రధాన తారాగణంగా ఎన్.రాధోడ్ దర్శకత్వంలో ఎం.మణీంద్రన్ రూపొందిస్తున్న చిత్రం ‘రామసక్కనోడు’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభించారు. తొలి సన్నివేశంపై దాసరి నారాయణరావు క్లాప్‌నివ్వగా, వినాయకరావు కెమెరా స్విచ్చాన్ చేశారు. రాజ్‌కందుకూరి తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ- అందమైన ప్రేమకథతో, వైవిధ్యమైన కథనంతో స్క్రీన్‌ప్లే హైలెట్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రం అందరికీ నచ్చేలా వుంటుందని, యువత ప్రేమలో ఎలా వుండాలీ అన్న కథనంతో ఈ సినిమా రూపొందుతోందని తెలిపారు. కార్తిక ఆనంద్, సత్యం రాజేష్, ఎల్.బి.శ్రీరాం, సారికా రామచంద్రరావు, తోటపల్లి మధు, జెమిని రాఘవ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు:శ్రీనాధ్‌రెడ్డి, సంగీతం:డి.జె.వసంత్, కెమెరా: బి.వి.అమర్‌నాధ్‌రెడ్డి, నిర్మాత: ఎం.మణీంద్రన్, దర్శకత్వం: ఎం.రాధోడ్.