శేఖరంగారి అబ్బాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అఛీవర్స్ సిగ్నేచర్ ఎం.ఎఫ్ క్రియేషన్స్ పతాకంపై విన్ను మద్దిపాటి, అక్షత జంటగా రూపొందిస్తున్న చిత్రం ‘శేఖరంగారి అబ్బాయి’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ హైదరాబాద్‌లో నటుడు మోహన్‌బాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకురాలు అక్షత మాట్లాడుతూ, సినిమా చాలా రిచ్‌గా ఉంటుందని, సాంకేతిక నిపుణులు, నటులకు మంచి పేరు తెచ్చే విధంగా రూపొందించామని తెలిపారు. మోహన్‌బాబు మాట్లాడుతూ, నటుడికి ప్రతిరోజు ఓ పాఠంలాంటిందని, ఈ చిత్ర దర్శకురాలు అక్షత బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిలవాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. శేఖరంగారి అబ్బాయి చిత్రం మంచి కథ కథనంతో, పక్కా ప్లాన్‌తో రూపొందించారని, తప్పక విజయం సాధిస్తుందని నటుడు కాశీ విశ్వనాధ్ తెలిపారు. ఈ చిత్రం కోసం అందరం కష్టపడి పనిచేశామని, తప్పక విజయవంతం అవుతుందన్న నమ్మకం వుందని హీరో విన్ను అన్నారు. నిర్మాత మద్దిపాటి సోమశేఖరరావు మాట్లాడుతూ- టాకీపార్ట్ పూర్తయిన ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను, పాటలను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సూర్య, అనూప్, డిఎమ్‌కె, సాయి ఎలెందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా:రాఘవ, ఎడిటింగ్:నందమూరి హరి, నిర్మాతలు:మద్దిపాటి సోమశేఖరరావు, మధు ఫోమ్రా, దర్శకత్వం:అక్షత.