వెంకీ-పవన్‌లతో మల్టీస్టారర్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్‌కళ్యాణ్ కథానాయకుడిగా వుంటే ఆ సినిమా గురించి ప్రత్యేకత చెప్పవలసిన అవసరం లేదు. అదో పెద్ద సినిమాగా రూపొందడం ఖాయం. అలాగే, హీరో వెంకటేష్ ఏ చిత్రంలో నటించినా దానికంటూ హంగులు, ప్రత్యేకతలు ఉంటాయి. అలాగే దర్శకుడు త్రివిక్రమ్ నేతృత్వంలో వచ్చే ఏ సినిమా అయినా సరే, ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతుంది అన్నమాట నిజం. ఈ ముగ్గురూ అంటే పవన్‌కల్యాణ్, వెంకటేష్ కథానాయకులుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందితే ఎలా వుంటుంది? ఆ ఆలోచనే సినిమా అభిమానులకు ఉత్కంఠ కలిగిస్తోంది. అలాంటి సినిమానే త్వరలో ఒకటి సెట్స్‌పైకి వెళ్లనుందా అని ప్రశ్నిస్తే, ఖచ్చితంగా వుంది అని టాలీవుడ్‌లో వినిపిస్తున్న సమాచారం. హీరోల ఆలోచనా విధానం మారడంతో మల్టీస్టారర్ చిత్రాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. కథ నచ్చితే చాలు ఎవరితోనైనా తాము సినిమాలు చేయడానికి సిద్ధమంటున్నారు. గతంలో పవన్‌కళ్యాణ్, వెంకటేష్‌ల కాంబినేషన్‌లో ‘గోపాల గోపాల’ ఎంత హిట్ అయిందో తెలిసిందే. ఆ జంటకు త్రివిక్రమ్ తోడైతే ఇక చెప్పేదేముంది? ఆ దిశగా ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. పవన్‌కళ్యాణ్-త్రివిక్రమ్ కలయికలో రూపొందనున్న సిని మా నవంబర్‌లో ప్రారం భం కానుంది. ఈ చిత్రంలో వెంకటేష్ కూడా నటించనున్నారని టాలీవుడ్ టాక్. ఈ ముగ్గురూ కలిసి అందించనున్న ఆ చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలో తెలియనున్నాయి.