రీమేక్ సినిమాతో రవితేజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బెంగాల్‌టైగర్’ సినిమా తరువాత రవితేజ ఇంతవరకూ ఒక్క చిత్రానికి ఓకె చెప్పలేదు. ఇప్పటికే పలువురు దర్శకులతో చర్చలు జరిపినట్టు తెలిసింది. అయినా కూడా రవితేజ ఒక్క ప్రాజెక్టూ ఫైనల్ చేయకపోవడం ఆసక్తిగా మారింది. తాజా సమాచారం ప్రకారం పవర్ ఫేం బాబితో సినిమా చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడట. దర్శకుడు బాబి ఇటీవల పవన్‌తో ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రాన్ని రూపొందించాడు. ఆ సినిమా భారీ పరాజయం మూటకట్టుకోవడంతో బాబి పరిస్థితి అయోమయంలో పడింది. దాంతో మళ్లీ రవితేజ బాబికి అవకాశమిచ్చినట్లు తెలుస్తోంది. అయితే, వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కే ఈ చిత్రం ఓ కొరియన్ హిట్ చిత్రానికి రీమేక్ అని తెలిసింది. ఇప్పటికే దానికి సంబంధించిన హక్కులు తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారట. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టి వచ్చే నెలలో సినిమాని సెట్స్‌పైకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.