కలిసొచ్చిన అదృష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో అందరూ గోల్డెన్ హ్యాండ్ అన్నారు. ఓకె అనుకుని బాలీవుడ్‌లోకెళితే ఐరెన్ లెగ్ అన్నారు. ఒకే వ్యక్తికి వ్యతిరేకమైన రెండు పేర్లు ఎలా వుంటాయి? అంటోంది కథానాయిక తమన్నా. విషయంలోకెళితే, టాలీవుడ్‌లో నెంబర్‌వన్ స్థానానికెదిగిన తమన్నా, ‘బాహుబలి’ హిట్ తరువాత మరింతగా స్టామినా సాధించింది. కెరీర్ పరంగా ఆమె బాట నల్లేరుపై నడకలా సాగింది. ‘ఊపిరి’ చిత్రంకూడా మరింత ఊపిరిపోసింది ఆమె కెరీర్‌కి. తెలుగులో అవకాశాలపై అవకాశాలు వస్తున్నా ఆమె చూపంతా బాలీవుడ్‌పైనే వుంది. గతంలో అక్కడ కూడా ఓ నాలుగు సినిమాలు చేసి ఐరెన్‌లెగ్ ముద్ర వేయించుకుని వచ్చేసింది. ‘బాహుబలి’ చిత్రం అన్ని భాషల్లో అనువాదం అవ్వడంతో, ముఖ్యంగా బాలీవుడ్‌లో తమన్నాకు మంచి గుర్తింపు వచ్చేసింది. అక్కడ కూడా గోల్డెన్ హ్యాండ్ అనడం మొదలుపెట్టారు. ఆ దెబ్బతో రెండు హిందీ చిత్రాలలో అవకాశాలు ఆమెను వెదుక్కుంటూ వచ్చాయి. ప్రస్తుతం ఆమె రణవీర్ సింగ్ రిటర్న్స్‌తోపాటుగా ఊపిరి హిందీ రీమేక్‌లో కూడా అవకాశాన్ని కొట్టేసింది. ఈ రెండు చిత్రాలు కనుక హిట్ అయితే తమన్నా బాలీవుడ్‌కే పరిమితమవుతుందో ఏమో చూడాల్సిందే.

చిత్రం.. తమన్నా