శ్రీశాంత్ టీమ్ 5

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ మాజీ ఫాస్ట్‌బౌలర్ శ్రీశాంత్ కథానాయకుడుగా నిక్కీగల్రాని కథానాయికగా సురేష్ గోవింద్ దర్శకత్వంలో రాజ్ జకారియా రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రం గూర్చి నిర్మాత మాట్లాడుతూ.. శ్రీశాంత్‌ను సిల్వర్ స్క్రీన్‌పై చూడాలని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారని, తమ కథాకథనం మీద నమ్మకంతో, ఆయన బాడీ లాంగ్వేజ్‌కి తగిన విధంగా పాత్ర ఉండడంతో ఈ చిత్రంలో నటిస్తున్నారని తెలిపారు. పదునైన బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించే శ్రీకాంత్ నటనలో కూడా అంతే చలాకీతనం, పట్టుదల, స్టయిల్ చూపించనున్నారని, సినిమాను అక్టోబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. టీమ్ 5 అనే పేరుకు తగ్గట్టుగా సినిమా గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో సాగుతుందని, త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేస్తామని ఆయన అన్నారు. పార్లేమానె, మకరంద్ దేశ్‌పాండే తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, ఎడిటింగ్: దిలీప్ డెన్నిస్, పతాకం: సెలెబ్స్ అండ్ రెడ్ కార్పెట్, నిర్మాత: రాజ్ జకారియాస్, దర్శకత్వం: సురేష్ గోవింద్.