9న మిస్టర్ 420

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుణ్‌సందేశ్, ప్రియాంక భరద్వాజ్ జంటగా సాన్వి క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో గజ్జెల హరికుమార్‌రెడ్డి రూపొందించిన చిత్రం మిస్టర్ 420. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. వరుణ్‌వందేశ్‌కు ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలుస్తుందని, కథాకథనాలు విభిన్నంగా ఉంటాయని తెలిపారు. డిఫరెంట్ లుక్‌తో స్టయిలిష్‌గా నటించిన ఈ చిత్రంలో పృథ్వి పాత్ర హైలెట్‌గా ఉంటుందని, ఈ చిత్రానికి సంబంధించిన పాటలను ఈనెల 27న విడుదల చేసి, వచ్చేనెల 9న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని ఆయన తెలిపారు. షాయాజీషిండే, రఘుబాబు, సాయి, శేఖర్, షానీ, రఘు, జీవా, రచ్చ రవి తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు: చంద్రబోస్, అనంత్‌శ్రీరామ్, ఎడిటింగ్: నందమూరి హరి, కెమెరా: జశ్వంత్, సంగీతం: రియాన్ ముస్త్ఫా, మాటలు: మోహనచంద్ర, నిర్మాత: హరికుమార్ రెడ్డి గజ్జెల, దర్శకత్వం: ఎస్.ఎస్.రవికుమార్.