డూప్ లేని త్రయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంచాక్షరి పిక్చర్స్ పతాకంపై విష్ణురెడ్డి, అభిరామ్, సంజన, అశోక్ ప్రధాన తారాగణంగా డా.గౌతమ్ దర్శకత్వంలో పద్మజానాయుడు రూపొందిస్తున్న చిత్రం త్రయం. చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు గౌతమ్ మాట్లాడుతూ.. ముగ్గురు వ్యక్తుల జీవితంలో ఎదురైన అనేక సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని, ముగ్గురు వ్యక్తుల శక్తియుక్తుల సమాహారంగా, రియలిస్టిక్‌గా ఈ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. యాక్షన్ సన్నివేశాలలో ఎలాంటి రోప్స్, డూప్స్ లేకుండా షూటింగ్ చేశామని, అవి ఈ చిత్రంలో హైలెట్‌గా ఉంటాయని తెలిపారు. కథానాయకులుగా నటించిన ఇద్దరికి అనేక గాయాలైనా లెక్కచేయకుండా ప్రేక్షకులకు థ్రిల్ కలిగేలా నటించారని, తెలుగు ప్రేక్షకులకు పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అందిస్తున్నామని, ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోందని ఆయన అన్నారు. యాక్షన్ చిత్రాలను ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పక నచ్చుతుందని, వచ్చేనెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని ఆయన వివరించారు. ఈ చిత్రానికి నిర్మాత: పద్మజానాయుడు, దర్శకత్వం: డా.గౌతమ్.

చిత్రం.. విష్ణురెడ్డి, సంజన