చిరంజీవి ఖైదీ నెంబర్ 150

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిరంజీవి కథానాయకుడుగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిస్తున్న భారీ చిత్రానికి ‘ఖైదీ నెంబర్ 150’ అనే పేరును ఖరారు చేశారు. మొదట ఈ చిత్రానికి ‘కత్తి’, ‘కత్తిలాంటోడు’ అన్న పేర్లను పరిశీలించారు. చివరికి సెంటిమెంట్ పరంగా ‘ఖైదీ నెంబర్ 150’గా నిర్ణయించారు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో కాజల్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన 50 శాతం షూటింగ్ పూర్తయింది. చిరంజీవి జన్మదినోత్సవ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు వినాయక్ మాట్లాడుతూ, చిరు అభిమానుల్లో చాలా హుషారు కనిపిస్తోందని, ఆయన స్టెప్పెస్తే, చిందేస్తే ఎలా ఉండబోతోందో చూడబోతున్నామని, ఆయనలో మునుపటి ఎనర్జీ కనిపిస్తోందని అన్నారు. నవతరం హీరోలు సాయిధరమ్‌తేజ్, అల్లు శిరీష్ ప్రత్యేకంగా పూజలు, హోమాలు జరిపిస్తున్నారని, ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రం సరికొత్త తరహాలో ఉండబోతోందని అన్నారు. తెలుగు ప్రేక్షకులకు నచ్చే అన్ని కమర్షియల్ అంశాలతో, తెలుగు నేటివిటీకి దగ్గరగా రూపొందించిన కథాంశంతో రూపొందిస్తున్నామని, దేవిశ్రీప్రసాద్ సంగీతం సినిమాకు హైలెట్‌గా ఉండబోతోందని ఆయన అన్నారు. ‘బాస్ ఈజ్ బ్యాక్’ అన్న టైటిల్‌తో సరికొత్త జోష్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రం సమ్‌థింగ్ స్పెషల్‌లా ఉంటుందని ఆయన అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రత్నవేలు, సంగీతం: దేవిశ్రీప్రసాద్, దర్శకత్వం: వి.వి.వినాయక్.