ఆనందమానందమాయె!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల భామ రకుల్‌ప్రీత్‌సింగ్ ఈమధ్య టాలీవుడ్‌లో చాలా జోరు పెంచింది. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. అటు యువ హీరోలను, ఇటు సీనియర్ హీరోలను బాగానే లైన్లో పెట్టింది. ముఖ్యంగా మహేష్‌తో నటించాలనే కోరిక వుందంటూ చెప్పిన భామకు త్వరలోనే ఆ ఛాన్స్ దక్కింది. మహేష్-మురగదాస్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రంలో రకుల్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆమె మహేష్‌తో పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. మొదటిసారి మహేష్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఎగ్జైటింగ్‌గా వుందంటూ సంబరపడిపోతోంది. మహేష్, మురగదాస్‌లాంటి టాలెంటెడ్ పర్సన్స్‌తో పనిచేయడం చాలా ఆనందంగా వుందని ట్వీట్ చేసింది. త్వరలోనే మహేష్‌తో రకుల్ పాల్గొనే రొమాంటిక్ సన్నివేశాలు కూడా చిత్రీకరిస్తారట. మొత్తానికి మహేష్ సరసన నటించడం మర్చిపోలేని అనుభూతి అంటోంది ఈ ముద్దుగుమ్మ.