విష్ణు సరసన హన్సిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాట్‌భామ హన్సిక ఈమధ్య కోలీవుడ్‌లోనే ఎక్కువగా సినిమాలు చేస్తోంది. తాజాగా మరో తెలుగు సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది. ఈసారి ఆమె జతకట్టేది మంచు విష్ణుతో. వరుస ప్లాపుల్లో ఉన్న తనకు ‘దేనికైనా రెడీ’ చిత్రంతో మంచి బ్రేక్ ఇచ్చిన హీరోయిన్ హన్సికతో విష్ణు రెడీ అవుతున్నాడు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని ‘గీతాంజలి’ఫేమ్ ‘రాజ్‌కిరణ్’ తెరకెక్కించనున్నాడు. యాక్షన్ ఫార్ములాని నమ్ముకుని వరుస పరాజయాలను రుచి చూసిన విష్ణు చివరగా నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో ‘దేనికైనా రెడీ’వంటి కామెడీ ఎంటర్‌టైనర్‌తో హిట్‌కొట్టిన సంగతి తెలిసిందే. అందుకే విష్ణు ఈసారి కూడా అదే పద్ధతిలో సినిమా తీసి మరో విజయాన్ని అందుకోవాలనే ప్రయత్నంలో ఈ ప్రాజెక్టుకు సైన్‌చేసినట్టు తెలుస్తోంది.