రామ్‌చరణ్‌తో ఎక్స్‌ప్రెస్ దర్శకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య రామ్‌చరణ్ స్పీడ్ పెంచాడు. ఇప్పటికే ‘ధ్రువ’ సినిమాలో నటిస్తున్నాడు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందే ఈ సినిమా దసరాకు విడుదల కానుంది. ధ్రువ సినిమా తరువాత చరణ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్‌తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్‌పై రూపొందే ఈ సినిమా అక్టోబర్‌లో మొదలుకానుంది. ఇక ఇప్పుడు మరో సినిమాకు సన్నాహాలు చేస్తున్నాడు చరణ్. సందీప్‌కిషన్‌తో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ రూపొందించి మంచి గుర్తింపు తెచ్చుకున్న మేర్లపాక గాంధీ ఆ తరువాత శర్వానంద్‌తో ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ఇప్పుడు రామ్‌చరణ్ కోసం ఓ కథ రెడీ చేసాడని, చరణ్ కూడా అతని కథను విన్నాడట! లైన్ కూడా బాగా నచ్చడంతో స్క్రిప్ట్‌ను సిద్ధం చేయమని చెప్పాడట. సుకుమార్ సినిమా తరువాత వీరి కాంబినేషన్‌లో వచ్చే సినిమా సెట్స్‌పైకి రానుంది.