దసరా కానుకగా ప్రేమమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైతన్య అక్కినేని, శ్రుతిహాసన్, మడొన్నా సెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్‌ల కాంబినేషన్‌లో దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమమ్’. ప్రస్తుతం చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలోని ఒక పాటను ఇటీవల ఎఫ్.ఎం. స్టేషన్‌లో విడుదల చేసిన విషయం విదితమే. ‘ఎవరే....’ అంటూ సాగే ఈ గీతాన్ని గీత రచయిత శ్రీమణి రచించగా, గాయకుడు విజయ్ ఏసుదాస్ ఆలపించారు. ఈ గీతం ఇప్పటికే లక్షలాది మంది సంగీత ప్రియులను అలరించింది’ అని అన్నారు. యువసామ్రాట్ అక్కినేని నాగార్జున (ఆగస్టు 29) పుట్టిన రోజు కానుకగా ఎవరే పాట వీడియోను విడుదల చేస్తున్నట్లు నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు.
అక్కినేని జయంతి రోజున ఆడియో
స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావుజయంతి, సెప్టెంబర్ 20న ‘ప్రేమమ్’ ఆడియోను అక్కినేని వంశాభిమానుల సమక్షంలో చిత్ర ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరుపుతామని చెప్పారు. కాగా ప్రేమతో కూడిన సంగీత భరిత దృశ్యకావ్యం అయిన ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో ‘దసరా పండుగ’ కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు చైతన్య అక్కినేని మాట్లాడుతూ, ‘నా మనసుకు బాగా హత్తుకున్న చిత్రం ఇది. ప్రతి ఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది ‘ప్రేమమ్’ అన్నారు.