కల్యాణ్‌రామ్-సాయిధరమ్‌లతో మల్టీస్టారర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవలే గోపీచంద్‌తో ‘సౌఖ్యం’ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి, తన తదుపరి చిత్రానికి సన్నాహాలు చేస్తున్నాడు. నందమూరి కళ్యాణ్‌రామ్, మెగా హీరో సాయిధరమ్‌తేజ్‌లతో మల్టీస్టారర్ చిత్రానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గురువారం దర్శకుడు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు రవికుమార్ చౌదరి మాట్లాడుతూ- కళ్యాణ్‌రామ్-సాయిధరమ్‌లతో మల్టీస్టారర్ చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇప్పటికే ఇద్దరు హీరోలు ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. అందరికీ నచ్చే అన్ని రకాల కమర్షియల్ అంశాలతో తెరకెక్కే సినిమా ఇది. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నారు. ఇండస్ట్రీలో పెద్ద కుటుంబాలుగా, ఎక్కువమంది ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న నందమూరి, మెగా కుటుంబాల్లోని నటులతో సినిమా చేస్తున్నాను కాబట్టి చాలా రిస్క్ వుంటుంది. ఇద్దరినీ బ్యాలెన్స్ చేస్తూ ఈ చిత్రాన్ని రూపొందించాలి. ఖచ్చితంగా ఇద్దరి హీరోలకు సమన్యాయం చేస్తానని అనుకుంటున్నాను. ప్రీప్రొడక్షన్ పనులు కూడా త్వరలోనే మొదలుపెడతా. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే యూనిట్‌తో కలిసి తెలియజేస్తాం. కళ్యాణ్‌రామ్‌తో చాలారోజులుగా ఓ సినిమా చేయాలని ప్రయత్నాలు జరిగాయి. అలాగే పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో సాయిధరమ్‌తో మంచి అనుబంధం ఏర్పడింది. ఈ ఇద్దరి హీరోలతో సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. గోపీచంద్‌తో సౌఖ్యం చేసిన తరువాత రెండు సినిమాల అవకాశాలు వచ్చాయి. కానీ ఈ మల్టీస్టారర్ సినిమా కోసం అవి ఒప్పుకోలేదు. అలాగే ఈ సినిమా తరువాత ఈతరం ఫిలింస్ బ్యానర్‌లో మరో చిత్రం చేస్తాను. నేను ఇప్పటివరకూ చేసిన సినిమాల నిర్మాతలు చాలా మంచి వ్యక్తులు దొరికారు. అలాంటివారితో పనిచేయడం మర్చిపోలేని అనుభూతి అన్నారు.