హీరోగానే కాదు.. ఏ పాత్రలైనా చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి తారకరత్న హీరోగా వెంకటరమణ సాల్వ దర్శకత్వంలో ముప్పా క్రాంతి చిత్ర పతాకంపై ముప్పా అంకమ్మచౌదరి నిర్మించిన ‘ఎవరు’ చిత్రం ఈనెల 26న విడుదలవుతున్న సందర్భంగా హీరో నందమూరి తారకరత్న చెప్పిన విశేషాలు ఆయన మాటల్లో...
విభిన్నమైన కథ
దర్శకుడు రమణ సాల్వ చెప్పిన కథ బాగా నచ్చింది. సినిమాకోసం వర్క్‌షాపులు కూడా నిర్వహించాం. ఇది కమర్షియల్ సినిమా కాదు. ఒక నార్మల్ కథతో తెరకెక్కిన సినిమా. మా నిర్మాత ముప్పా అంకమ్మచౌదరితో నాకు చాలాకాలంగా అనుబంధం వుంది. ఆ అనుబంధంతోనే ఈ సినిమా చేస్తున్నాం. సినిమా మొత్తం ఒకే ఇంట్లో జరుగుతుంది.
జర్నలిస్టుగా..
ఇందులో నేను జర్నలిస్టుగా నటిస్తున్నాను. ఒక సూపర్ పవర్ గురించి అనే్వషణ చేసే వ్యక్తిగా కనిపిస్తాను. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ ఇది. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్ ప్రాచిబోరా పాత్ర కీలకంగా వుంటుంది. ఆమె కూడా చాలా మంచి పాత్ర చేసింది. తెలియని శక్తుల గురించి ఆరా తీసే వ్యక్తిగా కనిపించే నాకు హీరోయిన్ పాత్ర సపోర్టుగా నిలుస్తుంది. నిజానికి ఈ సినిమాకు యామినీ చంద్రశేఖర్ అనే పేరు పెట్టాం కానీ, కథ ప్రకారంగా ‘ఎవరు’ అయితేనే బావుంటుందని ఫిక్స్ అయ్యాం. ఇందులో నా పాత్ర మంచి గుర్తింపుని ఇస్తుంది.
హీరోగానే కాదు
నేను హీరోగానే నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. మంచి పాత్ర వస్తే ఇతర చిత్రాల్లో తప్పకుండా చేస్తా. ‘అమరావతి’, ‘రాజా చెయ్యివేస్తే’ చిత్రాల్లోని పాత్రలకు మంచి పేరొచ్చింది. మోహన్‌లాల్ నటించిన ‘మనమంతా’ సినిమాలో చిన్న పాత్ర చేశాను. ప్రస్తుతం నేను ‘రాజా మీరు కేక’ చిత్రంలో నటిస్తున్నాను.

-శ్రీ