నట్టిని వదిలిపెట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్యాంగ్‌స్టర్ నరుూమ్‌తో తెలుగు సినీరంగానికి చెందిన పలువురు నిర్మాతలకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించిన నట్టికుమార్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నట్టికుమార్ ఆరోపణలపై నిర్మాత సి.కళ్యాణ్ శుక్రవారం స్పందించారు. ఈ విషయంపై నిర్మాతల మండలి చాలా సీరియస్‌గా ఉందని, నిరాధార ఆరోపణలు చేసి పబ్లిసిటీ తెచ్చుకోవడమే అతని నైజం అని అన్నారు. నట్టికుమార్ ఓ పిచ్చికుక్క అని, అతని చరిత్ర అంతా బ్లాక్‌మెయిలింగేనని కళ్యాణ్ ఆరోపించారు. నట్టికుమార్ చేష్టలు భరించలేక అతడిని విశాఖ నుంచి తరిమేశారని ఆయన విమర్శించారు. నరుూం కంటే నట్టికుమార్ బాధితులే ఎక్కువని కళ్యాణ్ అన్నారు. నరుూం ఎవరో తనకు తెలియదని సి.కళ్యాణ్ స్పష్టం చేశారు. ఒకవేళ నట్టికుమార్ దగ్గర ఆధారాల ఉంటే బయటపెట్టాలని, అంతేకానీ అనవసరంగా మరోసారి నోరుజారితే సరైన బుద్ధిచెబుతాం అంటూ ఫైర్ అయ్యారు. నరుూమ్‌కు సినిమా పరిశ్రమలో కొందరితో సంబంధాలున్నాయని నిర్మాత నట్టికుమార్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో సి.కళ్యాణ్ పై విధంగా స్పందించారు. అసలు పరిశ్రమలో ఎవరితో కూడా నరుూమ్‌కు సంబంధాలు లేవని, అతని ఆటలు మేము ఇక్కడ సాగనివ్వం కాబట్టే మాలో కొంతమంది పేర్లు చెప్పాడని, అతనో పనికిమాలిన వ్యక్తి అని పేర్కొన్నారు. గతంలో కూడా నాకు భానుకిరణ్‌తో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయని, ఆ ఆరోపణలు నిజం కాదని, ఇన్ని రోజులు అయినా కేసులు అవి రుజువు కాలేదని చెప్పారు. అంతేకాకుండా నరుూమ్ వషయంలో పరిశ్రమలో ఎవరికన్నా సంబంధం ఉందన్న విషయం తెలిస్తే వారిపై పోలీసులు చర్య తీసుకునేలా చేస్తామని అన్నారు. మాపై ఇలాంటి నిరాధార ఆరోపణలు చేసిన నట్టికుమార్‌పై ఇప్పటికే నిర్మాతల మండలి చర్యలు తీసుకుందని, అతనికి షోకాజ్ నోటీసు ఇస్తున్నామని, అలాగే ఛాంబర్ తరఫున కూడా చర్య తీసుకుంటున్నామని, అతని దగ్గర ఆధారాలుంటే అవి పోలీసులకు అందజేయాలని, ఒకవేళ ఎలాంటి ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆరోపిస్తే మాత్రం అతనిపై తగు చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను కోరుతున్నామని అన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రిని కలుస్తామని ఆయన అన్నారు.