కొత్త కుర్రోడు వస్తున్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీరామ్, మహేంద్ర, ప్రియానాయుడు హీరోహీరోయిన్లుగా లైట్ ఆఫ్ లవ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.మోహన్‌రావు దర్శకత్వంలో రమేష్ భగవత్ నిర్మిస్తున్న చిత్రం ‘కొత్త కుర్రోడు’. ఈ చిత్రం షూటింగ్ శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సి.కళ్యాణ్ క్లాప్‌నివ్వగా మరో నిర్మాత రామసత్యనారాయణ స్విచ్ ఆన్ చేశారు. అనంతరం పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మోహన్‌రావు మాట్లాడుతూ, ‘ఆకతాయిగా తిరిగే ఓ కుర్రాడు గ్రామ సర్పంచ్ కూతుర్ని పెళ్లిచేసుకుంటే కోటీశ్వరుడవ్వచ్చని తెలుసుకుని, ఆ ఊరువెళ్లి ఎలా ఇబ్బందులు పడ్డాడు.. ఆ అమ్మాయి ప్రేమని ఎలా దక్కించుకున్నాడన్నదే కథ. యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే చిత్రమిది. హైదరాబాద్, రాజమండ్రి, పాలకొల్లు తదితర ప్రాంతాల్లో చిత్రీకరిస్తాం..’ అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ, కొత్త నటీనటులతో చేస్తున్న ఈ సినిమా మంచి యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కుతున్న చిత్రమిది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎలేన్‌థర్, కెమెరా: సతీష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.రాజానాయుడు, నిర్మాత: రమేష్ భగవత్, దర్శకత్వం: మోహన్‌రావు.