దువ్వాడ జగన్నాథం ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరైనోడు విజయం తర్వాత అల్లు అర్జున్ కాస్త గ్యాప్ తీసుకుని నటిస్తున్న చిత్రానికి రంగం సిద్ధమైంది. హరీష్‌శంకర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈరోజు వైభవంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ పనులతో సహా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని హీరో అల్లు అర్జున్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ చిత్రానికి టైటిల్ డి.జె (దువ్వాడ జగన్నాధం) పేరుతో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. టైటిల్‌లోనే వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్న ఈ చిత్రం బన్నీ స్టయిల్‌కి సరిపడే విధంగా కమర్షియల్ పంధాలో ఉంటుందని దర్శకుడు తెలిపారు. ‘గబ్బర్‌సింగ్’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ విజయాల తర్వాత హరీష్‌శంకర్ రూపొందిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందట.