చుట్టాలబ్బాయికి ప్రేక్షకాదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరభద్రం దర్శకత్వంలో ఆది హీరోగా నటించిన చుట్టాలబ్బాయి చిత్రం విజయవంతంగా మూడవ వారంలోకి ప్రవేశించిందని, ఈ విజయంతో తామెంతో పొంగిపోతున్నామని యూనిట్ సభ్యులు అన్నారు. చుట్టాలబ్బాయి ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ప్లస్ విజయోత్సవ వేడుక సోమవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్స్‌లో యూనిట్ సభ్యుల ఆనందోత్సాహాల మధ్య జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు వీరభద్రం మాట్లాడుతూ.. టైటిల్ పెట్టిన దగ్గరనుండి అది జనంలోకి దూసుకుపోయింది. ఇప్పుడు ప్రేక్షకులు మా చుట్టాలబ్బాయిని తమ సొంతం చేసుకున్నారు. తిరుపతిలో థియేటర్‌కి వెళ్లినపుడు హౌస్‌ఫుల్ అవటంతో పాటు జనం కేరింతలు, చప్పట్లు ఎంతో చక్కగా ఆస్వాదిస్తున్నారని, అది చూసిన తర్వాత అంతవరకూ తనలో ఉన్న కొద్దిపాటి టెన్షన్ కూడా పోయిందన్నారు. వైజాగ్‌లోని వి.వి.వినాయక్ థియేటర్‌లో ప్రెస్‌మీట్ పెట్టినప్పుడు ఆయనే స్వయంగా ఫోన్ చేసి అభినందించటం మరింత సంతోషం కలిగించిందన్నారు. నిర్మాతలు రాం, వెంకట్‌లు మాట్లాడుతూ.. విజయపథాన దూసుకుపోతున్న ఈ చిత్రాన్ని నిర్మించినందుకు ఆనందంగా ఉందన్నారు. తొలి చిత్రంతోనే విజయాన్ని పొందటం, మూడోవారంలో కూడా కలెక్షన్స్ రావటం తాము ఊహించలేదన్నారు. మరిన్ని క్వాలిటీ చిత్రాలను నిర్మించేందుకు మా ప్రయత్నాలను మరింత వేగవంతం చేస్తామని తెలిపారు. హీరో ఆది మాట్లాడుతూ ‘టైటిల్ కాచీగా ఉంది. ఫాస్ట్‌గా జనంలోకి వెళ్లిపోయింది. విజయయాత్ర సమయంలోనే ప్రేక్షకుల రెస్పాన్స్‌ను స్వయంగా చూసిన అనుభూతి మిగిలింది. లీడింగ్ థియేటర్స్‌లో వేయటంవల్ల మూడోవారం కూడా హౌస్‌ఫుల్ కలెక్షన్స్ నడుస్తున్నాయి’ అని అన్నారు.