చవితికి ధ్రువ టీజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌చరణ్ హీరోగా నటిస్తోన్న ‘ధ్రువ’ సినిమా దసరా కానుకగా అక్టోబర్ మొదటివారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఈమధ్యే విడుదలైన ఫస్ట్‌లుక్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న టీమ్, ఫస్ట్ టీజర్‌ను కూడా త్వరలోనే విడుదల చేయాలని భావిస్తోంది. సెప్టెంబర్ 5న వినాయకచవితి సందర్భంగా ఈ ఫస్ట్ టీజర్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా టీమ్‌నుంచి ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం టాకీపార్ట్ చివరి దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కూడా సమాంతరంగా జరుగుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను గీతాఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. హిపాప్ తమిజా అందించిన ఆడియో సెప్టెంబర్ నెలాఖర్లో విడుదలకానుంది. తమిళంలో ఘన విజయం సాధించిన ‘తని ఒరువన్’కి రీమేక్ అయిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రకుల్‌ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తుంది.