ఉషా ఉతుప్ పాటతో 7టు4

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిల్క్‌మూవీస్, మినర్వాటాకీస్ పతాకాలపై విజయ్‌శేఖర్ సంక్రాంతి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం 7టు4. ఆనంద్ బచ్చు, రాధిక, లౌక్య, రాజ్‌బాల, పి.బి.శ్రీనివాస్, మల్లికార్జున్ తదితరులు ముఖ్యపాత్రలుగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన
టీజర్‌ను ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయ్‌శేఖర్ సంక్రాంతి మాట్లాడుతూ అందరికీ నచ్చే కథాకథనాలతో రూపొందిన ఈ చిత్రంలో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉంటాయని, ఈ చిత్రం ద్వారా ఇద్దరు మహిళలను పరిచయం చేస్తున్నామని, ఒకరు సంగీత దర్శకురాలిగా, మరొకరు గీత రచయిత్రిగా పరిచయవౌతున్నారని తెలిపారు. ఈ చిత్రం టీజర్ చూస్తే ఠాగూర్ చిత్రం గుర్తుకు వచ్చిందని పలువురు చెప్పారని, ఉషా ఉతుప్ వంటి గాయనీమణి ఈ చిత్రంకోసం అద్భుతంగా పాట పాడారని ఆయన అన్నారు.
ఇది ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో వి.రామసత్యనారాయణ, బాలునాయక్, వల్లూరిపల్లి రమేష్, శ్రీలక్ష్మి వందన తదితరులు పాల్గొన్నారు. శ్రీకాంత్, ప్రవీణ్, నివాస్, భరత్, కిరణ్, నితేష్, కార్తీక్, అనూష్, వెనె్నల, దివ్య తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు: శ్రీలక్ష్మి వందన, సంగీతం: స్నేహలత మురళి, కెమెరా: ఇ.కె.ప్రభాత్, ఎడిటింగ్: సత్య గిడుతూరి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, నిర్మాణం, దర్శకత్వం: విజయ్‌శేఖర్ సంక్రాంతి.