ప్రేమంటే సులువు కాదురా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజీవ్ సాలూరి, సిమీదాస్ జంటగా గోవింద్‌రెడ్డి దర్శకత్వంలో ఆర్.పి. ప్రొడక్షన్స్ పతాకంపై భవనాసి రాంప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమంటే సులువుకాదురా’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైన సందర్భంగా నిర్మాతలు వివరాలు తెలియజేస్తూ ‘మా దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించిన చిత్రమిది. స్క్రీన్‌ప్లే హైలెట్‌గా సాగుతుంది. ప్రాణం కమలాకర్ ఇచ్చిన రీరికార్డింగ్ హైలెట్‌గా నిలుస్తుంది. రాజీవ్ కెరీర్‌లో బెస్ట్ చిత్రం ఇది. అలాగే ఎడిటింగ్ ఎస్.బి.ఉద్ధవ్ చేశారు. ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలకు ఎడిటింగ్ అందించిన ఆయన మా సినిమాకు చేయడం ఆనందంగా వుంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేశాం. తప్పకుండా ఈ ఏడాది హిట్ చిత్రాల జాబితాలో మా చిత్రం ఉంటుంది’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ, అనుకున్న విధంగా చిత్రాన్ని పూర్తిచేశాం. ఫీల్‌గుడ్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం తప్పకుండా ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని అన్నారు.