పోస్ట్ ప్రొడక్షన్‌లో ఆమే.. అతడైతే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనీష్, చిరాశ్రీ జంటగా కె.సూర్యనారాయణ దర్శకత్వంలో శ్రీ కనకదుర్గా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఎం.మారుతిప్రసాద్, ఎన్.రాధాకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘ఆమే అతడైతే’. షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ రచయిత పరుచూరి వేంకటేశ్వరరావు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘టైటిల్ కొత్తగా వుంది. ముఖ్యంగా భిన్నమైన కానె్సప్ట్ ఇది. టైటిల్ ఎంత ఆసక్తి రేపుతుందో సినిమా కూడా అలాగే వుంటుందని అనుకుంటున్నాను’ అన్నారు. దర్శకుడు సూర్యనారాయణ మాట్లాడుతూ ’తెలుగు మీడియంలో డిగ్రీ చదువుకున్న ఓ విలేజ్ కుర్రాడు కలెక్టర్ కావాలని కలలుగన్న తన తండ్రి ఆశయాన్ని ఎలా నెరవేర్చాడు అనే కథాంశంతో తెరకెక్కిన సినిమా ఇది. ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో అన్ని రకాల అంశాలుంటాయి. క్లాసికల్ డాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్న హనీష్‌ని హీరోగా పరిచయం చేస్తున్నాం. అలాగే, కన్నడంలో హీరోయిన్‌గా పాపులరైన చిరాశ్రీ హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరు తమ తమ పాత్రలు అద్భుతంగా పోషిస్తున్నారు. త్వరలోనే మిగతా కార్యక్రమాలన్ని పూర్తిచేసి చిత్రాన్ని విడుదల చేస్తామని అన్నారు.