భాగమతి కోసం భారీ సెట్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో స్టార్ హీరోలతో సమానంగా బాక్సాఫీస్ వద్ద సత్తాచాటిన అనుష్క అటు స్టార్ హీరోల చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ ఔరా అనిపిస్తోంది. ప్రస్తుతం ‘బాహుబలి-2’, ‘సింగం-3’, ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రాల్లో నటిస్తోన్న అనుష్క తాజాగా భాగమతి చిత్రంలో నటిస్తోంది. పిల్లజమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోందట. ఈ సినిమా కోసం ఓ భారీ సెట్‌ను వేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. భాగమతి చిత్రం పిరియాడికల్ సినిమా కాదని, ఇది సాంఘిక చిత్రమేనని చిత్ర యూనిట్ తెలిపింది. మొత్తానికి భాగమతికోసం దాదాపు ఐదు కోట్ల ఖర్చుతో వేస్తున్న ఈ సెట్‌లో క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరిస్తారట.