ప్రేమమ్ దర్శకుడి డ్రీమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగచైతన్య, శ్రుతిహాసన్‌లతో ‘ప్రేమమ్’ చిత్రాన్ని రూపొందిస్తున్న చందూ మొండేటి తన తదుపరి చిత్రానికి సన్నాహాలు చేస్తున్నాడు. దక్షిణాదిలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐ డ్రీమ్ మీడి యా నిర్మాణంలో ఈ చిత్రం రూపొందనుంది. కార్తికేయ చిత్రంతో దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమైన చందూ మొండేటి తన తదుపరి చిత్రంగా ‘ప్రేమమ్’ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తికావచ్చిన ఈ చిత్రం దసరా కానుకగా విడుదలకానుంది. ఈ సినిమా తరువాత తాను ఐ డ్రీమ్ మీడియా బ్యానర్ నిర్మించే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నానని, ఐ డ్రీమ్ వ్యవస్థాపకులు వాసుదేవరెడ్డి, రాజ్‌కుమార్ ఆకెళ్ళతో తనకు చాలాకాలంగా పరిచయం వుందని అన్నారు. ఓవర్సీస్‌లో తెలుగు సినిమాకు ప్రధాన కేంద్రంగా మారింది. అలాగే తెలుగు సినిమాను అంతర్జాతీయంగా విడుదల చేయడంలో ఐ డ్రీమ్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే వెల్లడి చేస్తామని తెలిపారు. చందూ ఎంతో ప్రతిభావంతమైన దర్శకుడని, ఆయనతో సినిమా నిర్మిస్తున్నందుకు ఆనందంగా వుందని వాసుదేవరెడ్డి తెలిపారు.

చిత్రం..చందూ మొండేటి