సుదీప్ హలో బాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్నడంలో విజయవంతమైన విష్ణువర్థన చిత్రాన్ని హాపీ మూవీస్ పతాకంపై శే్వతలాన, వరుణ్, తేజ, సి.వి.రావు తెలుగులో ‘హలో బాస్’గా అనువదిస్తున్నారు. సుదీప్, సోను సూద్, ప్రియమణి ప్రధాన తారాగణంగా నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, కన్నడంలో అఖండ విజయం సాధించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని, అనువాదం అన్న మాట ఎక్కడా కనపడకుండా అనేక జాగ్రత్తలతో సినిమాను తెలుగు సినిమాగా అనువదించామని, ప్రియమణి నటన ఈ సినిమాలో హైలెట్‌గా వుంటుందని తెలిపారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని వారు తెలిపారు. భావన, ద్వారకేశ్, కార్తీక్, అరుణ్‌సాగర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:హరికృష్ణ, కెమెరా:రాజారత్నం, ఫైట్స్:రవివర్మ, సమర్పణ:సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:పి.కుమార్.