రేష్మికి జంటగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల తార రేష్మిగౌతమ్‌తో హీరోగా నటిస్తుండడంతో తనకు పరిశ్రమలో మరింత క్రేజ్ పెరిగిందని నూతన నటుడు రాజ్‌బాల తెలిపారు. లవ్‌బూమ్, 7 టు 4 చిత్రాలతో ఎదిగిన ఆయన తన మనసులోని మాట తెలియజేశారు. చాలామంది స్టార్ హీరోలను తెరపై చూసి, ఆ ప్రభావంతో పరిశ్రమకు వచ్చానని, సినిమాలపై ఇష్టంతో నటనను కెరీర్‌గా ఎంచుకున్నానని అన్నారు. థియేటర్ ఆర్ట్స్‌లో డిప్లొమా పూర్తిచేసిన తాను అవకాశాల కోసం మొదట ఇబ్బందిపడినా, ఇప్పుడు వరుస అవకాశాలు రావడంతో పరిశ్రమ దృష్టి తనపై పడినట్లుగా తాను భావిస్తున్నానని అన్నారు. రేష్మి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో తాను ముఖ్యపాత్రలో నటిస్తున్నానని, ఈ చిత్రంతోపాటుగా మరో నూతన దర్శకుడు రూపొందిస్తున్న హైదరాబాద్ స్లమ్‌డాగ్స్ అనే మరో చిత్రంలో కూడా హీరోగా నటిస్తున్నానని చెప్పారు.