కుటుంబ నేపథ్యంలో శ్రీరామరక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రజిత్, షామిలి జంటగా వశిష్ఠ సినీ అకాడమీ పతాకంపై రాము దర్శకత్వంలో ప్రభాత్‌వర్మ రూపొందిస్తున్న చిత్రం ‘శ్రీరామరక్ష’. దీనికి సంబంధించి టాకీపార్ట్ మొత్తం పూర్తిచేశారు.
ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, ఒక్క పాట మినహా టాకీపార్ట్ మొత్తం పూర్తిచేశామని, కుటుంబ నేపథ్యంలో మెలో డ్రామాగా సాగే ఈ చిత్రం ప్రేక్షకులకు సామాజిక బాధ్యతను తెలియజేసేలా వుంటుందన్నారు. సందేశాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను త్వరలో విడుదల చేస్తామని, ఈనెలలోనే ఆడియోను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు. వైవిధ్యమైన కథకు స్క్రీన్‌ప్లే హైలెట్‌గా సాగే ఈ చిత్రంలో అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చే అంశాలు వున్నాయని, నూతన నటీనటులందరూ అనుభవం వున్న వారిలా నటించడం ఆశ్చర్యాన్ని కలిగించిందని, సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులు ఓ సరికొత్త జోనర్‌ను ఈ చిత్రంలో చూశామని ఒప్పుకుంటారని అన్నారు. నిషా, విజయ్‌కుమార్, షఫి, జ్యోతి, రాజ్యలక్ష్మి, కాశీ విశ్వనాథ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు, పాటలు:పరిమి కేదారినాథ్ , సంగీతం: సాబూ వర్గీస్, నేపథ్య సంగీతం:వైధి, కెమెరా: ఎస్.మురళీమోహన్‌రెడ్డి, నిర్మాత: ప్రభాత్‌వర్మ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాము.