తాప్సీని భయపెట్టిన అభిమాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ భామ తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ జోరుమీదుంది. హీరోయిన్‌గా సౌత్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈమెకు పెద్దగా కమర్షియల్ విజయాలు దక్కలేదు. దాంతో బాలీవుడ్‌కు మకాం మార్చింది. ఈమధ్యే ఓ అభిమాని వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెబుతోంది. ఆ వివరాల్లోకెళితే ఓ సైకో తనను చాలాకాలం వెంబడించాడని చెప్పింది. అభిమానం ఉంటే బాగానే వుంటుంది కానీ, హద్దులు దాటితేనే సైకోల్లా మారతారని చెబుతోంది. కొన్ని రోజులుగా ఓ అభిమాని తను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేవాడట. ఒక్కోసారి సెక్యూరిటీని దాటుకుని తనతో క్లోజ్‌గా ఉండడానికి ప్రయత్నించాడట. అతనివల్ల ఏదైనా సమస్య వస్తుందేమోనని భయపడి పోలీసులకు ఫిర్యాదు చేసిందట. ఇలాంటి వీరాభిమానుల పట్ల జాగ్రత్త అవసరమని చెబుతోంది ఈ భామ.