లచ్చి టీజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుల్లితెరపై ‘వెనె్నల’ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన జయతి కథానాయికగా నటిస్తున్న చిత్రం లచ్చి. జె 9 4షోస్ పతాకంపై ఈశ్వర్ దర్శకత్వంలో జయతి రూపొందిస్తున్న ఈ సినిమాను అక్టోబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పూరి జగన్నాథ్ అతిథిగా విచ్చేసి లచ్చి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఎస్.వేణుగోపాలాచారి టీజర్‌ను ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ పల్లెల్లో లచ్చి అనే పిలుపు చిరపరిచితమని , ఈ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అనేక టీవీ కార్యక్రమాలు నిర్మించిన అనుభవంతో ఈ సినిమా నిర్మాణం చేపట్టానని, మెయిన్ లీడ్‌లో నటించానని కథానాయిక జయతి అన్నారు. హారర్ కామెడీ జోనర్‌లో రూపొందించిన ఈ చిత్రంలో ప్రముఖ కమెడియన్స్ అందరూ నటించారని, కథంతా లచ్చి పాత్ర చుట్టే తిరుగుతుందని ఆమె చెప్పారు. సురేష్ యువన్ అందించిన ఆడియోను త్వరలో విడుదల చేస్తామన్నారు. తేజస్విని, దిలీప్, చంద్రమోహన్, పూర్ణిమ, రఘుబాబు, ధన్‌రాజ్, షేకింగ్ శేషు, రామ్‌ప్రసాద్ నటించిన ఈ చిత్రానికి పాటలు: కందికొండ, ఎడిటింగ్: ప్రభు, సంగీతం: సురేష్ యువన్, నిర్మాత: జయతి, దర్శకత్వం: ఈశ్వర్.

చిత్రం..జయతి