ఇంట్లో దయ్యం.. నాకేం భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లరి నరేష్ కథానాయకుడుగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ అందిస్తున్న చిత్రం ‘ఇంట్లో దయ్యం.. నాకేం భయం’. దీనికి సంబంధించి షూటింగ్ పూర్తికావస్తున్న సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, రెండు పాటలు పూర్తిచేయాల్సి ఉందని, ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభిస్తోందని అన్నారు. పూర్తిస్థాయి వినోదాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, హారర్ టచ్‌తో అందర్నీ ఆకట్టుకుంటుందని తెలిపారు. దసరా కానుకగా విడుదల చేస్తామని, ఇది తమ సంస్థలో మరో సూపర్ హిట్ చిత్రంగా నిలుస్తుందని తెలిపారు. తాను గతంలో అల్లరి నరేష్‌తో చేసిన చిత్రాలన్నీ హిట్ అయ్యాయని, మరోసారి తమ జంట హ్యాట్రిక్ కొట్టనుందని దర్శకుడు జి.నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. కృతిక, వౌర్యాని, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, షకలక శంకర్, చమ్మక్ చంద్ర, చలపతిరావు, కాదంబరి కిరణ్, ధన్‌రాజ్, ప్రగతి, రజిత, అమిత్, టార్జాన్, జయవాణి, అపూర్వ, ఆజాద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, కెమెరా: దాశరథి సివేంద్ర, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, మాటలు: రత్నం, పాటలు: భాస్కరభట్ల, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.నాగేశ్వర్‌రెడ్డి.